
హైదరాబాద్: సినీ నటులు ప్రకాశ్‌రాజ్, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధానికి తెరలేచినట్టే కనబడుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై పవన్ సోదరుడు నాగబాబు దీటుగా స్పందించారు. ‘మీకు భాజపా నచ్చకపోతే విమర్శించండి.. అంటూనే మీకు హర్షించగలిగే మనసులేదు’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా, జనసేన పొత్తు సత్తా చాటబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. మాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. అయితే.. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరూ అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ.. మీ భాష రాదు’ అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
ఇది చదవండి..
పవన్‌పై ప్రకాశ్‌రాజ్ విమర్శ.. నాగబాబు కౌంటర్!
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- అతడి స్థానంలో పంత్‌కు చోటు ఇవ్వండి
- రివ్యూ: బంగారు బుల్లోడు
- మరో కీలక ఆదేశంపై బైడెన్ సంతకం
- సంజూని కెప్టెన్ కాకుండా వైస్‌కెప్టెన్ చేయాల్సింది
- వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్ఈసీ
- టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?