close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ నటుడి వైద్యానికి రజని, కమల్‌ సాయం!

చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న తమిళ నటుడు పొన్నాంబళన్‌కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సహాయం చేశారని తెలిసింది. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ సహా మరికొందరూ ఆయనకు సహాయం చేశారని కోలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తమిళ్‌, తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన పొన్నాంబళన్‌ చాలా రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రెండు నెలలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద డబ్బులు అయిపోయాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ నటులు ఆయనకు సహాయం చేస్తున్నారు.

పొన్నాంబళన్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని కమల్‌ హాసన్‌ ముందుకొచ్చారని తెలిసింది. ఆ తర్వాత పొన్నాంబళన్‌తో రజనీ మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరా తీశారట. వైద్యానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారని సమాచారం.

‘రజనీ సర్‌ వ్యక్తిగతంగా పొన్నాంబళన్‌తో మాట్లాడారు. సాయం చేస్తానని అన్నారు. కుటుంబానికి ఎంత డబ్బు అందజేశారో రహస్యంగా ఉంచారు. పొన్నాబళన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’ అని రజనీ ప్రతినిధి రియాజ్‌ అహ్మద్‌ ఓ వార్తా సంస్థతో చెప్పారని తెలిసింది. రజనీతో ముత్తు, అరుణాచలం, కమల్‌తో అపూర్వ సగోదర్‌గళ్‌, మైకేల్‌ మదన కామరాజన్‌ చిత్రాల్లో పొన్నాంబళన్‌ నటించారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.