సినిమాకెళ్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటారట!
close
Published : 05/07/2020 03:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమాకెళ్తే ఈ జాగ్రత్తలు తీసుకుంటారట!

హైదరాబాద్: సినిమా విడుదలవుతుందంటే థియేటర్‌ దగ్గర ఉండే హంగామా గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. చాంతాడంత క్యూలూ, తోపులాటలు... టికెట్లను దొరకబుచ్చుకునేందుకు అభిమానుల తంటాలు అన్నీ ఇన్నీ కావు. తెరపై బొమ్మ పడ్డాకా స్నేహితులతో చేసే అరుపులు, కేకలతో థియేటర్‌ మొత్తం హోరెత్తేది. కరోనా దెబ్బకు ఈ సందడంతా కనుమరుగయ్యేలా ఉంది.

లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం స్క్రీన్లను తెరిస్తే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ పీవీఆర్‌ సినిమాస్‌ ఇటీవల ఓ వీడియో విడుదల చేసింది. కరోనా నుంచి ప్రేక్షకులకు రక్షణ కల్పించడానికి థియేటర్లలో చేపట్టే చర్యలను వివరించింది. బాక్సాఫీస్‌ దగ్గర టికెట్‌ తీసుకునేటప్పుడు తప్పకుండా ఒక మీటర్‌ దూరం పాటించాలి. డిజిటల్‌ పేమెంట్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించడం, ఎవరికైనా అనారోగ్యం తాలూకూ లక్షణాలు కనిపిస్తే వెనక్కి పంపడం, ఒకేసారి వినియోగించే త్రీడీ గ్లాసులు, పీపీఈ కిట్లు అమ్మడం, ప్రతి షోకు కుర్చీలను శానిటైజ్‌ చేయడం, ఒక సీటును సామాజిక దూరానికి మాత్రమే వదిలేయడం... ఇలా ఆ సంస్థ బోలెడు రక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆ వీడియోలో తెలిపింది.

అంతేకాదు థియేటర్లలో పనిచేసే సిబ్బందికి కొవిడ్‌ నిబంధనల పట్ల శిక్షణ ఇవ్వనుంది. పీవీఆర్‌ సినిమాస్‌కు దేశవ్యాప్తంగా 822 తెరలు ఉన్నాయి. శ్రీలంకలోనూ ఈ సంస్థ సినిమాలు ప్రదర్శిస్తుండటం విశేషం. ప్రభుత్వం అనుమతులు రాగానే తాము థియేటర్లు తెరవడానికి ఎంత సిద్ధంగా ఉన్నామో చెప్పిందీ ఈ సంస్థ.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని