ఉత్త‌మ వెబ్ సిరీస్‌గా చ‌ద‌రంగం  - chadarangam owned best web series award
close
Published : 15/05/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్త‌మ వెబ్ సిరీస్‌గా చ‌ద‌రంగం 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్రముఖ న‌టుడు శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చ‌ద‌రంగం భార‌తీయ ఉత్త‌మ వెబ్ సిరీస్ (ప్రాంతీయ‌) అవార్డు సొంతం చేసుకుంది. వీడియో, ఆడియో క్వాలిటీ ఆధారంగా ఎంపికైంది. స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021, ఎక్స్ఛేంజ్‌ ఫ‌ర్ మీడియా గ్రూప్ క‌లిసి ఈ అవార్డును ప్ర‌క‌టించాయి. 

ఈ అవార్డు దక్క‌డం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సిరీస్ మా హృద‌యానికి బాగా ద‌గ్గ‌రైంది.  భ‌విష్య‌త్తులో ఇలాంటి మ‌రిన్ని ప్రాజెక్టులు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. శ్రీకాంత్ గారు, ద‌ర్శ‌కుడు రాజ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్‌, చిత్ర బృందం వ‌ల్ల ఇది సాధ్య‌మైంది. న‌న్ను న‌మ్మినందుకు జీ 5కి ధ‌న్య‌వాదాలు. - న‌టుడు, సిరీస్ నిర్మాత మంచు విష్ణు.

2020 ఫిబ్ర‌వ‌రిలో జీ 5 వేదిక‌గా విడుద‌లైంది ఈ వెబ్ సిరీస్‌. రాజ‌కీయ నేప‌థ్యంలో తొమ్మిది భాగాలుగా వ‌చ్చి ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రించింది. ఈ సిరీస్‌ని 24 ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై మంచు విష్ణు నిర్మించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని