close
Published : 17/07/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మేర్లపాక గాంధీ ‘ఓటీటీ ఎక్స్‌ప్రెస్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఓటీటీ సినిమా’ ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఏ వుడ్‌ అయినా ఇదే  మాట వినిపిస్తోంది. వెండితెరపై దర్శకులుగా నిరూపించుకున్న వాళ్లు సైతం ఓటీటీవైపు చూస్తున్నారు. తాజాగా మరో  తెలుగు దర్శకుడు అలాంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అతనే మేర్లపాక గాంధీ. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’లతో మంచి హిట్‌లు కొట్టినా ఆ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’తో కాస్త డీలా పడిపోయిన మేర్లపాక గాంధీ ఓటీటీ ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. 

ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా ‘అంధాదున్‌’ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్న మేర్లపాక గాంధీ ఓ ఓటీటీ సినిమాకు కథ సిద్ధం చేశారట. తన డైరెక్షన్‌ టీమ్‌లో చాలా రోజులుగా ఉన్న అసోసియేట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. యూత్‌ను ఆకట్టుకునేలా అడల్ట్‌ కామెడీ జోనర్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో యువ నటులు సంతోష్‌ శోభన్‌, బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు ముఖ్యపాత్రలు పోషిస్తారని ఓటీటీ వర్గాల టాక్‌. 

‘ఆహా’ యాప్‌ కోసం ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోందనే వార్తలూ వినిపిస్తున్నాయి.  గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ కలిసి కొన్ని సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే విశాఖపట్నంలో సముద్రపు ఒడ్డున ఓ రిసార్ట్‌ కూడా అద్దెకు తీసుకున్నారని అనుకుంటున్నారు. మరి ఈ ఓటీటీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని