close
హాలీవుడ్
‘అనకొండ’ మళ్లీ వస్తోందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: 90వ దశకంలోని చిన్నారులను, పెద్దలను భయపెట్టిన హాలీవుడ్‌ చిత్రం ‘అనకొండ’. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 45 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 136.8మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. కాగా, ఇప్పుడు ఈ సినిమాను సరికొత్త హంగులతో మళ్లీ తీసేందుకు సోనీ పిక్చర్స్‌ సన్నాహాలు చేస్తోందట. కొత్త సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయట. అయితే, ఈ సినిమాలో నటించే నటీనటులతో పాటు, దర్శకుడు, నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా తీస్తే, భారీగా ఉంటుందని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ‘అనకొండ’ చిత్రంలో జెన్నిఫర్‌ లోపేజ్‌, ఐస్‌ క్యూబ్‌, జాన్‌ వొగిట్‌, ఇరిక్‌ స్టాల్జ్‌, విల్సన్‌ తదితరులు నటించారు. ఈ సినిమా తర్వాత ‘అనకొండ’ పేరుతో పలు చిత్రాలు వచ్చినా, అవేవీ ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.