బాలీవుడ్‌లో మరో యువ నటుడు కన్నుమూత
close
Published : 12/07/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌లో మరో యువ నటుడు కన్నుమూత

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌, బుల్లితెర నటుడైన రంజన్‌ సెహగల్‌ (36) కన్నుమూశారు. శనివారం రాత్రి పంజాబ్‌లోని చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో రంజన్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

బుల్లితెర నటుడిగా సుపరిచితమైన రంజన్‌.. అనంతరం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2016లో రణ్‌దీప్‌ హుడా, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘సరబజిత్‌’లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫోర్స్‌, కర్మ వంటి చిత్రాలతో పాటు, పలు పంజాబీ సినిమాల్లోనూ ఆయన నటించారు. క్రైమ్‌ పెట్రోల్‌ టీవీ సిరీస్‌లో కనిపించారు. ఇదే ఏడాదిలో బాలీవుడ్‌కు చెందిన నటులు రిషికపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, సరోజ్‌ ఖాన్‌, వాజీద్‌ ఖాన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. తాజా ఉదంతంతో మరోసారి బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని