ఆ ఆంక్ష రాజకీయ నేతలపై ఎందుకు లేదు?
close
Published : 14/07/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఆంక్ష రాజకీయ నేతలపై ఎందుకు లేదు?

‘65 ఏళ్లు’ నిబంధనపై సీనియర్‌ నటుల మండిపాటు

ముంబయి: కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమాల చిత్రీకరణ నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా నటీనటులంతా షూటింగ్స్‌ లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే షూటింగ్స్‌ కోసం కొన్ని నిబంధనలతో కూడిన  అనుమతులిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 65ఏళ్లు పైబడిన నటీనటులు చిత్రీకరణలో పాల్గొనకూడదని పేర్కొంది. ఈ నిబంధనపై పలువురు బాలీవుడ్‌ సీనియర్‌ నటులు మండిపడుతున్నారు. ఈ చర్య వివక్ష చూపుతున్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై గతవారం నటి హేమమాలిని హోంశాఖకు లేఖ రాశారు. ఈ నిబంధనల వల్ల మధ్యలో ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయలేరని, నిబంధనలో మార్పులు చేయాలని కోరారు. తాజాగా మరికొందరు ఈ అంశాన్ని లేవనెత్తారు. 

బాలీవుడ్‌ నటి.. 69 ఏళ్ల షబానా అజ్మీ.. ప్రస్తుతం నిఖిల్‌ అడ్వాణి దర్శకత్వంలో ‘మొగల్‌’ అనే చిత్రంలో, వికాస్‌ ఖన్నా తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు నిల్చిపోయాయి. కేంద్రం విధించిన నిబంధనతో ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ‘‘వికాస్‌ ఖన్నా చిత్రంలో నేను మరికొన్ని సీన్లలో నటించాల్సి ఉంది. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఈ నిబంధన వల్ల నిర్మాతలు వయసులో ఉన్న నటులను తీసుకొని వృద్ధుల వేషాలు వేయించాలా? ఈ నిబంధన కేవలం చిత్ర పరిశ్రమకే ఎందుకు? రాజకీయ నాయకులకు ఎందుకు వర్తించదు? సినీరంగంలో పనిచేసే చాలామందికి వేరే ఆదాయం ఉండదు. వారిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’’అని వెల్లడించారు.

వృద్ధులను సురక్షితంగా ఉంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇది ఆచరణయోగ్యం కాదు. సినిమా సెట్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పరిశుభ్రత పాటిస్తూ, శానిటైజేషన్‌ చేసుకుంటూ షూటింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత సంక్షోభంలో 65 ఏళ్లు పైబడిన డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్నారు. వారికి కరోనా సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

- పరేశ్‌ రావల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని