close
బాలీవుడ్
 ‘పక్షిరాజా’కు భారీ పారితోషికం.. నిజమేనా?

ఎన్ని కోట్లు డిమాండ్‌ చేశారో తెలుసు?

ముంబయి: బాలీవుడ్‌ ఖిలాడీ, ‘పక్షిరాజా’ అక్షయ్‌ కుమార్‌ వరుస సినిమాలు, విజయాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు. ఆయన తన కొత్త సినిమాకు డిమాండ్‌ చేసిన పారితోషికం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యింది. అక్షయ్‌-ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందట. ఇటీవల ఈ సినిమా కోసం దర్శక, నిర్మాతలు అక్షయ్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ సినిమాకు ఆయన రూ.120 కోట్లు పారితోషికం అడిగినట్లు చెబుతున్నారు. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా అక్షయ్‌ నిలిచారని టాక్‌. మరి ఈ వార్తలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇదే చిత్రంలో సైఫ్‌ అలీ ఖాన్‌, ధనుష్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారట.

అక్షయ్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. కేవలం తెరపైనే కాదు తెర వెనుక కూడా ఆయన్ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రూ.120 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. అక్షయ్‌ గత ఏడాది ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు వరుసగా రూ.154 కోట్లు, రూ.202 కోట్లు, రూ.194 కోట్లు రాబట్టాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.