ఇంటర్నెట్ డెస్క్: నేచురల్ స్టార్ నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంతలా అలరించిందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ జోడీ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక డైలాగ్ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ తన కుటుంబం కోసం జగదీష్ ఏం చేశాడో చూపించారు. షైన్స్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘టక్ జగదీష్’ టీజర్‌ను మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!