close
Published : 23/01/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌

భావోద్వేగంగా ప్రెస్‌మీట్‌

హైదరాబాద్‌: సినిమా ప్రమోషన్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ అనుకోనివిధంగా భావోద్వేగపూరితంగా మారింది. తమ సినిమా గురించి మాట్లాడుతూ హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌ స్టేజ్‌పైనే కన్నీటి పర్యంతమయ్యారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కథాంశంగా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘సూపర్‌ ఓవర్‌’. బెట్టింగ్‌ వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది క్షుణ్ణంగా తెలియజేస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో ‘కలర్‌ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి, నవీన్‌చంద్రా ప్రధాన పాత్రలు పోషించారు.  దర్శకుడు సుధీర్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడు.. కారు ప్రమాదంలో దర్శకుడు ప్రవీణ్‌ కన్నుమూశారు. దీంతో మిగిలిన చిత్రాన్ని సుధీర్‌ వర్మ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

కాగా, తాజాగా జరిగిన ఈ సినిమా ప్రమోషన్‌లో ప్రవీణ్‌ను గుర్తు చేసుకుని చాందినీ, నవీన్‌, దర్శకుడు సుధీర్‌ కన్నీరు పెట్టుకున్నారు. ‘మా సినిమా ‘సూపర్‌ ఓవర్‌’ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసినందుకు ప్రవీణ్‌కు థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని ప్రవీణ్‌కే అంకితం చేస్తున్నాం. తను ఎక్కడ ఉన్నా సరే ఈ చిత్రాన్ని వీక్షించి సంతోషిస్తాడని అనుకుంటున్నా. మీ అందరితో కలిసి పనిచేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది’ అంటూ నటి చాందినీ కన్నీరు పెట్టుకున్నారు.

అనంతరం నటుడు నవీన్‌చంద్రా మాట్లాడుతూ.. ‘ప్రవీణ్‌వర్మ చాలా మంచి వ్యక్తి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. ఆయన గురించి మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. ఈ సినిమా కోసం టీమ్‌ మొత్తం ఎంతగానో శ్రమించింది. ఒక మనిషి ఆశయాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో సుధీర్‌ ఈ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుని పూర్తి చేశారు. సుధీర్‌కు ఎంతలా థ్యాంక్స్‌ చెప్పినా సరిపోదు. మా సినిమా షూట్‌లో ప్రతిరోజూ ప్రవీణ్‌నే గుర్తు చేసుకునేవాళ్లం. మేమే ఇంతలా బాధపడుతున్నామంటే ఆయన కుటుంబం ఎంతటి బాధను అనుభవిస్తుందో అర్థం చేసుకోగలం. ఆయన కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ నవీన్‌ ఎమోషనల్‌ అయ్యారు.

ఇదీ చదవండి

పోలీస్‌ స్టేషన్‌ దగ్గర దొంగతనమేంట్రా



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని