close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అయోధ్యపై ‘రామాయణం’ తారలు ఏమన్నారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీ రామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక. ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకొని బుధవారం కోవెల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దీంతో అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం అన్నట్లుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా రాముడి స్మరణతో భక్తసంద్రంలో మునిగితేలుతున్నారు. సాధారణ ప్రజలే భక్తి భావనతో ఉప్పొంగిపోతుంటే.. మరి రామాయణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన ‘రామాయణం’ సీరియల్‌ తారాగణం ఎలా ఫీల్‌ అవుతోంది?అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం సందర్భంగా ఆ సీరియల్‌లో నటించిన పలువురు తారలు ట్విటర్‌ వేదికగా ఏమన్నారంటే..

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ప్రపంచంలోని భక్తులందరి చిరకాల కల సాకారమవుతోంది. మీ అందరికి నా శుభాకాంక్షలు.- అరుణ్‌ గోవిల్‌, శ్రీరాముడి పాత్ర

ఇది భారతీయులకు ఒక గొప్ప విజయం. దీపాలను వెలిగిస్తూ.. రామనామ స్మరణ చేస్తూ ముందుకు పదండి- దీపికా చిఖ్‌లియా, సీతాదేవి పాత్ర

ఆగస్టు 5 చరిత్రాత్మక రోజు. ఆగస్టు 15 లాగే ఈ రోజు కూడా గుర్తుండిపోతుంది. 500 ఏళ్లనాటి సమస్య.. రామ మందిరం కోసం వేసిన పునాదిరాయితో ముగిసింది. భారతీయులందరికి శుభాకాంక్షలు. - సునీల్‌ లహ్రీ, లక్ష్మణుడి పాత్ర

500 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణుడు, శ్రీరాముడి పరమభక్తుడు హనుమాన్‌ తిరిగి అయోధ్యకు వచ్చారు. ఈ రోజును వెలుగులతో నింపేద్దాం. అలాగే శ్రీరాముడు తిరిగివచ్చినట్లే.. రామ రాజ్యం తిరిగి రావాలని ప్రార్థిద్దాం- విందు దారాసింగ్‌, ‘రామాయణం’లో హనుమాన్‌ పాత్ర పోషించిన దివంగత నటుడు దారాసింగ్‌ కుమారుడు

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.