close
Published : 04/07/2020 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాతో తెలుగు సినీ నిర్మాత కన్నుమూత

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, మంత్రులు అందరూ దీని బారిన పడుతున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎవరో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనా సోకి మృత్యువాతపడ్డారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

ఈతరం ఫిలింస్‌ అధినేత పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు. ఇటీవలే రామారావుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో రామారావు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఈతరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని