హైదరాబాద్: ‘‘సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రలంటే ఎంతో ఇష్టం. అయితే గ్లామర్ ప్రధానంగా సాగే పాత్రలే వచ్చాయి. తొలిసారి పల్లెటూరి అమ్మాయిగా కనిపించి నా కలని నెరవేర్చుకున్నా’’ అంటోంది ముస్కాన్ సేథి. అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ పరిచయం చేసిన కథానాయిక ఈమె. ఆయన తెరకెక్కించిన ‘పైసా వసూల్’లో బాలకృష్ణ సరసన, ఆ తర్వాత ‘రాగల 24 గంటల్లో’ నటించింది. ఇటీవల ఆమె చేసిన చిత్రం... ‘రాధాకృష్ణ’. జనవరి 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ముస్కాన్ సేథీ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ...
* ‘‘మనసుకు దగ్గరైన పాత్రలు చేస్తే ఆ ఆనందమే వేరు. ‘రాధాకృష్ణ’ కథ వినగానే... ఆ కథతోపాటు, కథానాయిక రాధ పాత్ర చాలా నచ్చింది. ఈ పాత్రకీ, నా వ్యక్తిగతానికి పోలికలేమీ ఉండవు. సామాజిక బాధ్యతతో కూడిన ఆ పాత్ర లక్ష్యం, అందులోని అమాయకత్వం నాకు బాగా నచ్చింది.
* సినిమా చేస్తున్నప్పుడు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’లోని ఐశ్వర్యారాయ్ గుర్తొచ్చింది. నటిగా ప్రతిభని ప్రదర్శించే అవకాశం దక్కింది. కథ రీత్యా తెలంగాణలోని నిర్మల్‌లో చిత్రీకరణ చేశాం. తెలుగులో విడుదలవుతున్న నా మూడో సినిమా ‘రాధాకృష్ణ.’’
* ‘‘దిల్లీలో పుట్టి పెరిగిన పంజాబీ అమ్మాయిని నేను. 19 యేళ్ల వయసులో ముంబయికి వచ్చా. డిగ్రీ చివరి యేడాదిలో ఉన్నప్పుడు హైదరాబాద్‌కి ఆడిషన్స్ కోసం వచ్చా. అప్పుడే పూరి జగన్నాథ్ దృష్టిలో పడటం, ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణతో సినిమా చకచకా జరిగిపోయాయి.
* ప్రస్తుతం తెలుగుతోపాటు, పంజాబీ, హిందీలోనూ నటిస్తున్నా. మా నాన్న బిజినెస్ మేన్, మా అమ్మ న్యాయవాది. రాజకీయాల్లోనూ ఉన్నారు. పొలిటికల్ థ్రిల్లర్ల్లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’.
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!