close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘విజయశాంతి.. మీ సినిమాకు మీరే బలం’

నటిని విష్‌ చేసిన మహేశ్‌, అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌: ఒకప్పుడు అగ్ర కథానాయికగా చిత్ర పరిశ్రమను ఏలిన నటి విజయశాంతి. ఆమె సినీ కెరీర్‌లో దాదాపు అందరు అగ్ర కథానాయకులతో కలిసి తెరను పంచుకున్నారు. ‘నాయుడమ్మ’ తర్వాత దాదాపు 13 ఏళ్లు విరామం తీసుకున్న విజయశాంతి ఈ ఏడాది మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో పవర్‌ఫుల్‌ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆసక్తికరమైన పాత్రల్లో అవకాశం వస్తే చేస్తానన్నారు.

కాగా విజయశాంతి బుధవారం తన 54వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, అనిల్‌ రావిపూడి తదితరులు విష్‌ చేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీరు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘విజయశాంతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నటించిన ఏ సినిమాకైనా మీరే బలం.. దానికి ఆస్తిలాంటి వారు. మా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో మీరు నటించిన తీరును కేవలం మాటల్లో చెప్పలేను’ అని అనిల్‌ పేర్కొన్నారు. వీరికి విజయశాంతి ‘ధన్యవాదాలు’ చెబుతూ రిప్లై ఇచ్చారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.