ఇంటర్నెట్ డెస్క్: సౌందర్య విమర్శ, గణాంకాల సంస్థ టీసీ కాండ్లర్ ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తాన్ని జల్లెడ పట్టి.. అందమైన ముఖ సౌందర్యం కలిగిన వంద మంది యువతుల జాబితాను తయారుచేస్తుంది. అందులో ఒకరిని విజేతగా ప్రకటిస్తుంది. దేశం, ప్రాంతం, జాతి భేదం లేకుండా సంపూర్ణ సౌందర్యమే ప్రాతిపదికగా ఈ పోటీ సాగుతుంది. కాగా, 2020కి గానూ ఈ స్థానాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన మోడల్, నటి యూల్ షెల్బియా గెల్చుకున్నారు. ‘ప్రపంచంలోనే అందమైన ముఖం’ గల యువతిగా ఎంపికవడంతో ఆనందంలో తేలిపోతున్నానన్న షెల్బియా.. గెలిచిన తర్వాత చేదు విమర్శలను కూడా ఎదుర్కొందట.
ఈ రేసులో ఉన్నట్టు కూడా తెలియకుండానే కిరీటం గెల్చుకున్నానని.. తనకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. 19 ఏళ్ల ఈ అందగత్తెకు ఇన్‌స్టాగ్రాంలో నాలుగు వేలకు పైగా కామెంట్లు వచ్చాయట. ఐతే అవన్ని అభినందలు, పొగడ్తలు మాత్రమే కావని చెప్పుకొచ్చింది. ద్వేషించే వాళ్లు ఎప్పటి మాదిరిగానే తనను కూడా దూషించారిని.. తనను బ్యూటీ క్వీన్ కాదు అగ్లీ క్వీన్ ( అందవిహీనమైన రాణి) అని చాలా మంది ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఐతే వాటిని తాను కనీసం పట్టించుకోనని కూడా చెప్పేసింది.
గ్లామర్ క్వీన్లు కిమ్ కర్దాషియన్, కైలీ జెన్నర్ల సౌందర్య ఉత్పత్తులకు.. యూల్ మోడల్‌గా పనిచేసింది. అమెరికన్ కోటీశ్వరుడు, సినీ, మీడియా దిగ్గజం సమ్మర్ రెడ్‌స్టోన్ మనవడు బ్రాండన్ కోర్ఫ్తో డేటింగ్లో ఉంది యూల్. అందం అనేది వ్యక్తిగత అభిప్రాయమని.. ఆడవారందరూ అందమైన వారేనని యూల్ అభిప్రాయపడింది. అందమైన ముఖమే కాకుండా.. దయ, వినయం, సానుకూల దృక్పధం లాంటి లక్షణాల వల్ల కూడా వ్యక్తులు అందంగా కనిపించవచ్చని నమ్ముతుందట. మనం నిజంగా మంచిగా ఉంటే అది మన కళ్లలో కనిపిస్తుందని.. అవి అబద్ధం చెప్పవంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
కీర్తి కూడా వచ్చేస్తున్నారు..!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!