close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్రిష్‌ 4’తో మళ్లీ జాదూ

హృతిక్‌ రోషన్‌ ‘క్రిష్‌’ సిరీస్‌ చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ‘క్రిష్‌ 4’ తెరకెక్కించనున్నట్టు దర్శకనిర్మాత రాకేష్‌ రోషన్‌ ఇప్పటికే ప్రకటించారు. సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలోనే కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల వాయిదా పడిందీ చిత్రం. ఇప్పుడు ఈ చిత్ర కథకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి బాలీవుడ్‌లో సందడి చేస్తోంది. ‘కోయీ మిల్‌గయా’ చిత్రంలో గ్రహాంతర వాసి జాదూ పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు ఈ పాత్రకు అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ‘క్రిష్‌ 4’లో చూపించబోతున్నారు. జాదూ సాయంతో క్రిష్‌ తండ్రి రోహిత్‌ మెహ్రాను కాపాడటమే ఈ కథాంశమని సమాచారం. ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులను షారుఖ్‌ఖాన్‌కు చెందిన రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్‌ఎక్స్‌ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘క్రిష్‌ 4’ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.