close
Published : 22/01/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాలయ్య కోసం ఓ మాస్‌ కథ!

‘క్రాక్‌’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆయన తదుపరి చిత్రం బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కబోతోంది. ఈ కలయికలో సినిమాని నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌ సన్నాహాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే బాలకృష్ణ కోసం గోపీచంద్‌ మలినేని ఓ మాస్‌ కథని సిద్ధం చేశారని, యాక్షన్‌ ప్రధానంగా ఆ చిత్రం సాగబోతోందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ లుక్‌ కూడా ఇందులో కొత్తగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఆ చిత్రం తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలోనే సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని