ఇంటర్నెట్ డెస్క్: సినిమా అభిమానులంతా పెద్ద సినిమాల గురించి అప్డేట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. యావత్ భారతీయ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విడుదల తేదీ ప్రకటించారు. సినిమాలో నటిస్తున్న ఐరిష్(ఐర్లాండ్) నటి అలిసన్ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. అందులో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 8న విడుదల కానుందంటూ ప్రకటించింది. అయితే.. వెంటనే ఆ పోస్టు వైరల్ కాకముందే తొలగించింది. ఆమె అనుకోకుండా చేసిన ఆ పోస్టులో నిజమెంత..? అనేది తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకూ ఎదురుచూడాల్సిందే మరి.
రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రామరాజుగా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్, చరణ్‌కు జంటగా అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్, హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కీలకదశలో ఉంది.
ఇదీ చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు అశ్విన్ సర్ప్రైజ్
మరిన్ని
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!