close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పూర్తికానిది పూర్తయింది

హిందీలో అగ్రతారగా కొనసాగుతూ హాలీవుడ్‌కెళ్లి అక్కడా సత్తా చాటుతున్న నాయిక ప్రియాంక చోప్రా. ఆమె తన జీవిత జ్ఞాపకాలతో ‘అన్‌ఫినిష్డ్‌’ పేరుతో ఓ పుస్తకం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పుస్తకం రాయడం పూర్తయినట్టు ప్రకటించింది ప్రియాంక. ‘‘అన్‌ఫినిష్డ్‌’ పూర్తయింది. కేవలం దానికి తుదిమెరుగులు దిద్దడమే మిగిలుంది. ఈ పుస్తకంలోని ప్రతి పదం నా జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఈ పుస్తకాన్ని మీతో పంచుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ప్రియాంక ఓ టెలివిజన్‌ సిరీస్‌ కోసం అమెజాన్‌ స్టూడియోస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థతో కలిసి ‘ఉయ్‌ కెన్‌ బీ హీరోస్‌’, ‘ది వైట్‌ టైగర్‌’ చిత్రాలు చేస్తుంది. మిండీ కాలింగ్‌తో ఓ వెడ్డింగ్‌ కామెడీలో నటిస్తోంది. వీటితో పాటు ‘ది మాట్రిక్స్‌ 4’ చిత్రంలోనూ సందడి చేయనుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.