ఓ చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుకు ముందు.. క్రీస్తు తర్వాత. అదే ఓ సినిమా గురించి అడిగితే? ఇంటర్వెల్‌కు ముందు ఇంటర్వెల్ తర్వాత అనాల్సిందే. అందుకే ఇంటర్వెల్ సన్నివేశాల్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. ఇది అన్ని చిత్రాలకూ వర్తించినా.. స్టార్ కథానాయకుల సినిమాలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం విషయంలో అలాంటిదే జరిగింది.
ఇందులో ఇంటర్వెల్ బ్యాక్‌డ్రాప్ కోసం షేర్‌ఖాన్ అనే శక్తిమంతమైన పాత్రను సృష్టించిందట చిత్ర బృందం. ఈ పాత్రకు సినిమాలో ఐదు నిమిషాల నిడివే ఉన్నప్పటికీ.. విరామానికి ముందు వచ్చే ఆ పాత్ర చిత్రానికి అత్యంత కీలకమైనదట. ఆ పాత్ర ఇంటర్వెల్ ముందే ‘‘నరసింహారెడ్డి, నీ లాంటివాడు దేశానికి కావాలి’ అంటూ చిరు చేతిలోని కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోతుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ పూర్తయ్యాక ఈ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, సంజయ్ దత్‌లలో ఎవరినో ఒకర్ని ఎంపిక చేసుకుందామనుకుంది చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల వాళ్లు ఈ ప్రాజెక్టును వదులుకున్నారు.
దీంతో ఓ దశలో ఆ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే బావుంటుందనే అభిప్రాయానికొచ్చారట దర్శకుడు సురేందర్ రెడ్డి. కానీ, తండ్రి కారణంగా తనయుడు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అనే సందేహంతో చరణ్‌తో ఆ పాత్రను చేయించడానికి ఒప్పుకోలేదట చిరు. అయితే ఇలాంటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కే చిత్రాలకు నిడివి ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. తొలి దశలోనే నిడివి సమస్యను అదుపులో పెట్టగలిగితే నిర్మాతలకు బడ్జెట్ కలిసి వస్తుంటుంది. అందుకే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందే.. స్క్రిప్ట్ దశలోనే కత్తెరకు పని చెప్పారట. ఈ క్రమంలోనే ఆ షేర్‌ఖాన్ పాత్రను స్క్రిప్ట్ దశలోనే తొలగించిందట చిత్ర బృందం.
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!