అందరూ పరుగులు తీశారు: శ్రధ్ధా శ్రీనాథ్
హైదరాబాద్: కథానాయకుడు బుల్లెట్ నడుపుతూ స్టైలిష్‌గా కనిపించడం సాధారణం.. కానీ కథానాయిక రైడింగ్ చేయడం అరుదుగా చూస్తుంటాం. ఇలా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా కోసం తొలిసారి బుల్లెట్ ఎక్కిన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ కిందపడ్డారు. ‘జెర్సీ’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. నానికి జంటగా నటించి మెప్పించారు. దీని తర్వాత ‘క్రిష్ణ అండ్ హిజ్ లీల’లో నటించారు. రవికాంత్ పేరూరు దర్శకత్వం వహించిన చిత్రమిది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడు. సీరత్ కపూర్, శాలినీ కథానాయికలు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
కాగా ఈ సినిమా సెట్లో తీసిన బైక్ రైడింగ్ వీడియోను శ్రద్ధ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘జూన్ 2017లో నందిహిల్స్‌లో షూట్ జరుగుతోంది. ఆరోజు సెట్లో చాలా మంది ఉన్నారు. రోడ్లంతా చెమ్మగా ఉన్నాయి. దర్శకుడు నా దగ్గరికి వచ్చి ‘బైక్ నడపడం వచ్చా?’ అని అడిగారు. ‘నో.. కానీ ప్రయత్నిస్తా..’ అని చెప్పా. నా ఎనిమిదేళ్ల వయసులో టూ వీలర్ నడపడం నేర్చుకున్నా.. సన్నివేశాన్ని తీయడంలో రాజీపడటం ఇష్టంలేక.. ధైర్యంగా బైక్ ఎక్కా. బుల్లెట్ బ్యాలెన్స్ చేయడం అంత కష్టమని నాకు అప్పటి వరకు తెలియదు. ఈ క్రమంలో నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. నేను కిందపడ్డా.. సెట్లో ఉన్న వారంతా నాకేమైందోనని కంగారుతో పరుగులు తీశారు. బైక్ కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు అంత బరువుగా ఉంటుంది..?’ అని ఆమె తన అనుభవాన్ని షేర్ చేశారు.
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్!
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
-
సందడి చేస్తోన్న ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!