ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసులంతా వెండితెరపై తమ నటనతో అలరించినవారే.. ఒక్క శ్వేతా బచ్చన్ తప్ప. ఆమె 1997లో ప్రముఖ నటుడు రాజ్ కపూర్ మనవడు నిఖిల్ నందాను మనువాడారు. కుమారుడు అభిషేక్ బచ్చన్ నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు.. శ్వేత మాత్రం ఎందుకు కెమెరా ముందుకు రాలేదని 2001లో మీడియా అమితాబ్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మా నలుగురిలో (ఆయన, జయ, శ్వేత, అభిషేక్) శ్వేత గొప్ప నటి. వివాహానికి ముందు సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని ఆమె ఎప్పుడూ మాతో చెప్పలేదు. ఇప్పుడు ఆమెకు పెళ్లైంది. ఒకవేళ శ్వేతకు నటిగా రాణించాలని ఉంటే... అది ఆమె భర్త చేతుల్లో ఉంది. ఆమెపై మాకున్న హక్కు పెళ్లి రోజుతో పోయింది’ అని పేర్కొన్నారు.
2000లో నటుడిగా అరంగేట్రం చేసిన అభిషేక్ అప్పటికే పలు సినిమాల్లో కనిపించారు. కుమారుడిని ఉద్దేశించి బిగ్‌బి మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అభిషేక్ సాధించాల్సింది చాలా ఉంది. అతడిలో ఆ సత్తా ఉందనే నమ్మకం నాకుంది. అతడి నైపుణ్యాన్ని తెరపై చక్కగా చూపించగలిగే వారు దొరకాలి. అతడి నటన విషయంలో మాత్రం నా అభిప్రాయం సూటిగా చెబుతుంటా. అభిషేక్ సినిమాల్ని మేమంతా కలిసి చూస్తుంటాం. జుట్టు, దుస్తులు, మూమెంట్స్, హావభావాలు, స్వరం.. ఇలా అన్నీ గమనించి, ఎక్కడ అభివృద్ధి అవసరమో చెబుతుంటా. చదువుల కోసం అభిషేక్‌ను చిన్న వయసులోనే విదేశాలకు పంపేశాం. దీంతో అతడికి హిందీ మాట్లాడటంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడిప్పుడే భాషపై పట్టుసాధిస్తున్నాడు..’ అని చెప్పారు.
ఇవీ చదవండి..
రజనీ జీవితంలో ఆసక్తికర ఘటనలు తెలుసా?
రజనీ ‘రోబో’ను ఇలా షూట్ చేశారు!
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!