close
హాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘నో టైమ్‌ టు డై’ సరికొత్త రికార్డు?

ఇంటర్నెట్‌డెస్క్‌: డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా బాండ్‌ సిరీస్‌లో తెరకెక్కిన 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. క్యారీ జోజి ఫుకునాగా దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో గత బాండ్‌ చిత్రాల రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టిందా? అంటే హాలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి.

అదేంటంటే.. ఇప్పటివరకూ విడుదలైన 24 బాండ్‌ చిత్రాల నిడివితో పోలిస్తే ‘నో టైమ్‌ టు డే’ అత్యధిక నిడివిగల చిత్రమని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా రన్‌టైమ్‌ 163 నిమిషాలని చెబుతున్నాయి. యూనివర్సల్‌ పిక్చర్స్‌ మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఇప్పటివరకూ 2015లో వచ్చిన ‘స్పెక్టర్‌’ (148 నిమిషాలు) అత్యధిక నిడివి గల చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక అతి తక్కువ నిడివి గల చిత్రం ‘క్వాంటమ్‌ ఆఫ్‌ సొలెస్‌’. దీని నిడివి 106 నిమిషాలు మాత్రమే. ఈ రెండు చిత్రాల్లోనూ డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడు కావడం గమనార్హం.

‘నో టైమ్‌ టు డై’ చిత్రం మార్చి 31న యూకేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆస్ట్రేలియాలో ఏప్రిల్ 8న, యూఎస్‌లో ఏప్రిల్‌ 10న విడుదలవుతుండగా, భారత్‌లో ఏప్రిల్‌ 2న విడుదలకానుంది. 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.