close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ రోజున ప్రకటిస్తారా?

కథానాయకుల పుట్టినరోజు వస్తోందంటే చాలు...కొత్త సినిమా కబుర్లేమైనా బయటికొస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అభిమానులు. కథానాయకులు కూడా ఆ సందడి మధ్యే సినిమా కబుర్లు వెల్లడించడానికి ఇష్టపడుతుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు ఈ నెలలోనే. ఆయన ఇప్పటికే పలువురు యువ దర్శకులతో సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపారు. వాటికి సంబంధించిన స్క్రిప్టు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) పూర్తి కథని సిద్ధం చేసి చిరంజీవికి వినిపించినట్టు సమాచారం. ఆయన పచ్చజెండా ఊపేశారని, ఈ పుట్టినరోజుకే ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయనే మాట చిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.