close
కొత్త సినిమాలు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్రీరామ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది

హైదరాబాద్‌: శ్రీరామ్‌ కథానాయకుడిగా నూలేటి వీర రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’. సంచిత పదుకొణె కథానాయిక. తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవాన్ని పురస్కరించుకొని  చిత్ర బృందం ఈ సినిమాలోని పాటలను విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నీలిమ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలోని పాటలకు విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయ్‌ ఏసుదాసు ఆలపించిన తల్లి సెంటిమెంట్‌ సాంగ్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాటలను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’ చిత్రాల తర్వాత శ్రీరామ్‌ కెరీర్‌లో ‘అసలేం జరిగింది’ గుర్తుండిపోయే చిత్రమవుతుంది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని అన్నారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఏలేందర్‌ మహవీర్‌ స్వరాలు సమకూర్చారు. 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.