close
హాలీవుడ్
రాకుమార్తెకు నిత్యా మేనన్‌ స్వరం

హైదరాబాద్‌: కథానాయిక నిత్యా మేనన్‌ హాలీవుడ్‌ సినిమా ‘ఫ్రోజన్‌ 2’లో సందడి చేయబోతున్నారు. ఆమె ఈ సినిమాలోని రాకుమార్తె ఎల్సా పాత్రకు గాత్రం ఇస్తున్నారు. ఈ విషయాన్ని నిత్యా మేనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. నవంబరు 22న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని మిస్‌ కావద్దని పేర్కొన్నారు. 2013లో డిస్నీ సంస్థ నుంచి వచ్చిన యానిమేషన్‌ చిత్రం ‘ఫ్రోజన్‌’ ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘ఫ్రోజన్‌ 2’ తెరకెక్కింది. క్రిస్‌ బక్‌, జెన్నీఫర్‌ లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని రాకుమార్తె ఎల్సా పాత్రకు ప్రియాంకా చోప్రా, రాకుమార్తె అన్నా పాత్రకు పరిణీతి చోప్రా హిందీలో డబ్బింగ్‌ చెప్పారు.

నిత్యా మేనన్‌ ప్రస్తుతం పలు మలయాళ, హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె తెలుగు తెరపై చివరిసారి ‘యన్‌.టి.ఆర్‌- కథానాయకుడు’లో అలనాటి తార సావిత్రి పాత్రలో మెరిశారు. ఆపై బాలీవుడ్‌ సినిమా ‘మిషన్‌ మంగళ్‌’తో విజయం అందుకున్నారు. ఆమెతోపాటు అక్షయ్‌ కుమార్‌, తాప్సి, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.290 కోట్లు రాబట్టింది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.