close
హాలీవుడ్
టెర్మినేటర్‌ సిరీస్‌కు పునర్వైభవం

సంచలనం సృష్టించిన ‘టెర్మినేటర్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ఫేట్‌’. ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ మరోసారి టెర్మినేటర్‌గా అలరించబోతున్నాడు. ‘డెడ్‌పూల్‌’ దర్శకుడు టిమ్‌ మిల్లర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జేమ్స్‌ కేమరూన్‌ కథ అందిస్తున్నారు. ఈ సిరీస్‌లోని తొలి రెండు చిత్రాలైన ‘టెర్మినేటర్‌’, ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’ చిత్రాలకు డైరెక్ట్‌ సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తొలి రెండు చిత్రాల్లో నటించిన లిండా హామిల్టన్‌ మళ్లీ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘ఈ చిత్రంతో ‘టెర్మినేటర్‌’ సిరీస్‌కు పునర్వైభవం వస్తుంది. తొలి రెండు చిత్రాల తర్వాత మళ్లీ  ఈ స్థాయి భావోద్వేగాలు, యాక్షన్‌ ఘట్టాలు ఇంకే చిత్రంలోనూ చూడలేదు’’ అన్నారు ఆర్నాల్డ్‌. నవంబరు 1న ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.