close
అప్పటి ముచ్చట్లు
అందుకే కమల్‌ ‘ఆదిత్య 369’ చేయలేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ విశేషంగా ప్రేక్షకులను అలరించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ తప్పకుండా ఉంటుంది. ప్రయోగాల దర్శకుడిగా పేరున్న సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. టైమ్‌ మెషీన్‌ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. 

ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించారు. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే, తొలుత కృష్ణ కుమార్‌ పాత్రలో కమల్‌ హాసన్‌ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించారట దర్శక-నిర్మాతలు. ఇక శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని ఆ పాత్రకు ఆయన్ను ఎంపిక చేశారు. కృష్ణ కుమార్‌ పాత్రకు మాత్రం కమల్‌ సరిపోతారని, ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌గా తెరకెక్కిందామనుకున్నారు. అయితే, అప్పటికి కమల్‌హాసన్‌ మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు సాధ్యం కాలేదు. దీంతో బాలకృష్ణే రెండు పాత్రలు పోషించారు. 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.