close
బాలీవుడ్
మాజీ ప్రియురాలితో షూటింగ్‌కి నో..

ముంబయి: మాజీ ప్రియురాలితో నటించేందుకు ఓ యువ నటుడు నో చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే కార్తీక్‌ ఆర్యన్‌. బాలీవుడ్‌లో యువ కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటుడు. గత కొంతకాలం క్రితం ఆయన సారా అలీఖాన్‌తో కలిసి ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆజ్‌ కల్‌’ చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరు పార్టీలకు, డిన్నర్లకు వెళ్తుండేవారు. దీంతో కార్తీక్‌-సారా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. జులైలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ‘ఆజ్‌ కల్‌’లో హీరో హీరోయిన్స్‌ మధ్య కొన్ని చిన్న సన్నివేశాలను యాడ్‌ చేస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు ఇంతియాజ్‌.. షూటింగ్‌ కోసం కార్తీక్‌ను సంప్రదించారట. అయితే కార్తీక్‌ మాత్రం ఇప్పుడు సారా అలీఖాన్‌తో నటించడానికి ఇష్టం చూపించడం లేదట. ఆ సన్నివేశాలు అంత ముఖ్యమైనవి కాకపోతే షూటింగ్‌ వద్దు అని దర్శకుడికి తెలిపారట. దీంతో కార్తీక్‌-సారా మధ్య మాటలు లేవని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇటీవల విడుదలైన ‘పతి పత్నీ ఔర్‌ హో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు కార్తీక్‌. ఈ సినిమాలో ఆయనకు జంటగా అనన్య పాండే నటించారు. అయితే సారా అలీఖాన్‌ కంటే ముందు అనన్యతో కార్తీక్‌ చాలా సన్నిహితంగా ఉండేవాడని, ‘పతి పత్నీ ఔర్‌ హో’ చిత్రం నుంచి అనన్యతో డేటింగ్‌లో ఉన్నాడని బాలీవుడ్‌ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.