close
బాలీవుడ్
‘బద్లా’పై మరోసారి స్పందించిన తాప్సీ

ముంబయి: ‘పింక్‌’, ‘ముల్క్‌’ ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ లాంటి బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేతత్వం ఆమెది. ఇటీవల ఆమె ‘బద్లా’ సినిమా గురించి పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిని అమితాబ్‌ చిత్రంగానే చూస్తున్నారని తాప్సీ అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తాప్సీ మరోసారి ‘బద్లా’ సినిమా గురించి స్పందించారు. 

‘‘బద్లా’ సినిమా విడుదలైన తర్వాత ఓ వెబ్‌ పోర్టల్‌ వాళ్లు.. ‘అమితాబ్‌ బద్లా’ చిత్రానికి ఇన్ని వసూళ్లు వచ్చాయి’ అని రాశారు. వెంటనే నేను.. ‘మీరు నా పేరును ప్రస్తావించడం మర్చిపోయినట్లున్నారు. అది నా సినిమా కూడా.’ అని ఆ పోర్టల్‌ వారికి రిప్లై ఇచ్చాను. నేను అలా చెప్పేది బిగ్‌బి క్రెడిట్‌ను తక్కువ చేయాలని కాదు. మహిళను కాబట్టే కదా మీరు నాకు సరైన క్రెడిట్‌ ఇవ్వడం లేదు. అందుకే దీన్ని ఓ హీరో చిత్రంగానే చూస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో నేను నటించినప్పటికీ ఈ చిత్రాన్ని ఒక నటుడి చిత్రంగానే ఎందుకు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని వెనుక ఉన్న లాజిక్‌ను తెలుసుకోవాలనుకుంటున్నాను. అమితాబ్‌ ఓ లెజెండ్‌ అనే విషయం నాకు తెలుసు అలాగే ఆయనంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌవరం ఉంది. ’ అని తాప్సీ తెలిపారు.

తాప్సీ, అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘బద్లా’. సుజాయ్‌ ఘోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కేవలం రూ.10కోట్లతో తీసిని ఈ సినిమా రూ.138 కోట్లకు పైగా రాబట్టింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.