
బాలీవుడ్లో బయోపిక్‌లు, చారిత్రక కథల జోరు ఎక్కువగానే ఉంది. చారిత్రక చిత్రాల్లో పోరాట ఘట్టాలు, యుద్ధ సన్నివేశాలను ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం చాలా కీలకం. ‘తాన్హాజీ’ ట్రైలర్ చూస్తుంటే పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మరాఠా యోధుడు తాన్హాజీ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘తాన్హాజీ:ది అన్సంగ్ వారియర్’. ఛత్రపతి శివాజీ దగ్గర సుబేదార్‌గా పనిచేసిన తాన్హాజీ కథ ఇది. తాన్హాజీ పాత్రలో అజయ్‌దేవ్‌గణ్ నటించారు. 1670లో తాన్హాజీ మొఘల్ సామ్రాజ్యంపై జరిపిన యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఔరంగజేబు సామ్రాజ్యంలో పనిచేసే కీలకమైన వ్యక్తి ఉదయ్ భాన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. తాన్హాజీ భార్య సావిత్రీబాయి పాత్రలో కాజోల్ నటించింది. అజయ్, కాజోల్ మధ్య సాగే సన్నివేశాలు భావోద్వేగాల రుచి చూపించాయి. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ