close
బాలీవుడ్
ముగ్గురూ కలిసొస్తుంటే బద్దలయ్యేది అగ్నిగోళమే

తెరపై శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో ఒక్కరు నటిస్తేనే ఆ పంచ్‌డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాలకు మాస్‌ జనాలు ఊగిపోతారు. మరి అలాంటిది ఏకంగా ముగ్గురు స్టార్‌ హీరోలు...పోలీస్‌ పాత్రల్లో ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్‌లో మోతే. ఆ సందడి చూడాలంటే రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న ‘సూర్యవంశీ’ చూడాల్సిందే. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో కీలక పాత్రల్లో మెరవనున్నారు అజయ్‌దేవగణ్‌, రణ్‌వీర్‌సింగ్‌. ‘సింగం’ చిత్రాలతో అజయ్‌దేవగణ్‌, ‘సింబా’తో రణ్‌వీర్‌సింగ్‌ పోలీస్‌ పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే చిత్రంలో చూపిస్తున్నారు రోహిత్‌శెట్టి. తాజాగా ఈ సినిమాలో రణ్‌వీర్‌, అక్షయ్‌, అజయ్‌ పోలీస్‌ గెటప్పుల్లో ఉన్న ఫొటోను అక్షయ్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘సింగం, సింబా, సూర్యవంశీ కలిశారు...అంటే 2020 మార్చి 27న థియేటర్‌లో పుట్టేది నిప్పురవ్వలు కాదు ఏకంగా అగ్ని గోళమే బద్దలైపోతుంది’’అని ట్వీటారు అక్షయ్‌.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.