close
బాలీవుడ్
జీవితాన్ని మార్చేసే అనుభవాలు ఆ రైల్లో దొరికాయి

విడాకులు తీసుకున్న ఓ మహిళ  మద్యానికి బానిసై ఎలాంటి లక్ష్యం, చేరాల్సిన గమ్యస్థానం ఏంటో  తెలియకుండా రోజూ రైల్లో ప్రయాణం చేస్తుంటుంది. కానీ ఓ రోజు ఆమెకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ థ్రిల్లర్‌ కథే ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’. బాలీవుడ్‌ నాయిక పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇదే పేరుతో  హాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ కోసం రెండు నెలలుగా లండన్‌లోనే ఉంది పరిణీతి. అక్కడి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సినిమాలో పరిణీతికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఆసక్తి రేకిత్తించేలా ఉంది. ముఖం మీద గాయాలతో బాత్‌టబ్‌లో కూర్చొని ఉన్న పరిణీతి లుక్‌ ఆకట్టుకుంటోంది. పరిణీతి మాట్లాడుతూ  ‘‘ఏడు వారాలు ఈ సినిమా కోసం లండన్‌లో ఉన్నాను. సినిమా  పూర్తయింది. కానీ ఇందులో పోషించిన పాత్రను మర్చిపోలేకపోతున్నాను. ఆ పాత్ర ఇప్పటికీ నాలో ఉండిపోయింది. నేను ఇప్పటివరకూ పోషించని పాత్ర ఇది. జీవితాన్ని మార్చేసే అనుభవాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటివి ఈ చిత్రంతో దక్కాయి’’ అని చెప్పింది. రిబు దాస్‌గుప్తా  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.