close
బాలీవుడ్
కపిల్‌ దేవ్‌ భార్యగా అందుకే చేస్తున్నా

నిజ జీవితంలో భార్యాభర్తలైన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ తెరపైనా అవే పాత్రల్లో  నటిస్తున్న చిత్రం ‘83’. భారత క్రికెట్‌ జట్టు 1983 ప్రపంచ కప్‌ పోటీల్లో సాధించిన చరిత్రాత్మక విజయాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. నాటి కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తుండగా, ఆయన భార్య రోమీ దేవ్‌గా దీపిక  కనిపించనుంది. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర నిడివి తక్కువే అయినా ఓ ప్రత్యేక కారణంతో దాన్ని అంగీకరించానని చెబుతోంది దీపిక. ‘‘రోమీ పాత్రను నేనే చేయాలని కబీర్‌ భావించారు. ఆ పాత్ర చిన్నదే కానీ ప్రత్యేకమైంది అనిపించింది. ఎందుకంటే ఓ వ్యక్తి విజయం వెనుక ఉండే భార్యకు లేదా కుటుంబ సభ్యులకు సరైన గుర్తింపు దక్కడం లేదు. క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు వారి కుటుంబ సభ్యుల పాత్రను ఎవరూ గుర్తించడం లేదు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ పాత్రను నేను చేస్తున్నా’’ అని చెప్పింది దీపిక.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.