close
బాలీవుడ్
దిశా యూట్యూబ్‌ఛానల్‌.. వీడియో చూశారా..!

ముంబయి: బాలీవుడ్‌ తార దిశాపటానీ సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను, ఫిటెనెస్‌ వీడియోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. తన లైఫ్‌స్టైల్‌ను తెలియచేస్తూ యూట్యూబ్‌లో మొదటి వీడియోను పోస్ట్‌ చేశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తన లైఫ్‌స్టైల్‌ను ఈ వీడియోలో చిత్రీకరించారు. జిమ్‌కి వెళ్లడం, డ్యాన్స్‌ నేర్చుకోవడం, లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌లో పాల్గొడం వంటివి ఈ వీడియోలో చూడొచ్చు.

తెలుగులో వచ్చిన ‘లోఫర్‌’ చిత్రంతో దిశాపటానీ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘భారత్‌’లో దిశాపటానీ మెరిశారు. సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంటగా నటించిన ఈ సినిమాలో దిశాపటానీ ముఖ్యపాత్రలో నటించారు.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.