close
కొత్త సినిమాలు
‘రూలర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

నందమూరి బాలకృష్ణ.. కేఎస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘రూలర్‌’. ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌, సాంగ్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో బాలయ్య మరింత ఆకట్టుకున్నారు. ‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు.. పొగరు ఉంటుందో చూపించమంటవా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. 

సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్‌ చౌహాన్‌ నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. భూమిక, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 20 ఈ చిత్రం విడుదల కానుంది. 

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.