close
కొత్త సినిమాలు
సంక్రాంతి బరిలో కల్యాణ్‌రామ్‌

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం ‘ఎంతమంచి వాడవురా!’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్‌లో కల్యాణ్‌ రామ్‌ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘118’ విజయం తర్వాత కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో మెహరీన్‌ కథానాయిక. ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్త ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.