close
కొత్త సినిమాలు
వారిద్దరి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు గోపీచంద్‌, మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌నంది దర్శకత్వంలో భారీచిత్రం తెరకెక్కనుంది. ‘యూటర్న్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా చిట్టూరి దీనిని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. అంతకుముందు సంపత్‌నంది దర్శకత్వంలో గోపీచంద్‌ ‘గౌతమ్‌నంద’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో గోపీచంద్‌కు జోడీగా హన్సిక నటించారు. 2017లో విడుదలైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.

ప్రస్తుతం గోపీచంద్‌ నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. మెహరీన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. దీనికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.