close
కొత్త సినిమాలు
విజయ్‌ దేవరకొండ గొప్ప ప్రేమికుడు!

నలుగురు కథానాయికలతో సినిమా

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ప్రపంచంలోనే ఫేమస్‌ ప్రేమికుడు కాబోతున్నారు. అదేంటి.. అనుకుంటున్నారా? ఆయన నటించనున్న కొత్త సినిమా టైటిల్‌ ఖరారైంది. దీనికి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ అనే టైటిల్‌ నిర్ణయించినట్లు విజయ్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబరు 20న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాకు ‘బ్రేకప్‌’ అనే టైటిల్‌ను అనుకున్నారట. కానీ చివరికి దీన్ని ఖరారు చేశారు.

‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్‌ రామారావు సమర్పించనున్నారు. గోపీ సుందర్‌ బాణీలు అందించనున్నారు. విజయ్‌ ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన ‘హీరో’ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ కొన్ని  కారణాల వల్ల అది ఆగిపోయినట్లు సమాచారం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.