close
కొత్త సినిమాలు
మరోసారి ఇద్దరు నాయికలతో..

చెన్నై: విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘యాక్షన్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇందులో ఆయన ఇద్దరు కథానాయికలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నిర్మాణ పనులు చాలావరకూ పూర్తయ్యాయి. తాజాగా పేరు ఖరారు కాని మరో చిత్రంలోనూ ఆయన ఇద్దరు నాయికలతో ఆడి పాడనున్నట్లు తెలిసింది. ఈ చిత్రంతో ఆనంద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలి షెడ్యూల్‌ చెన్నైలో జరిగింది. రెండో విడత షూటింగ్‌కు కోయంబత్తూరులో ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ సుమారు 20 రోజుల పాటు షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా నటిస్తున్నారు. రోబో శంకర్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువన్‌ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ముగిసిన వెంటనే మిష్కిన్‌ దర్శకత్వంలో ‘తుప్పరివాళన్‌ 2’ చిత్రంలో నటించే విషయంపై విశాల్‌ దృష్టి సారిస్తారని తెలిసింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.