close
కొత్త సినిమాలు
ఫన్నీగా ‘తెనాలి రామకృష్ణ’ టీజర్‌

‘ఒక కేసు ఇస్తే.. రెండో కేసు ఫ్రీ..’

హైదరాబాద్‌: యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ నటించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’. జి.నాగేశ్వర‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. పూర్తి వినోదాత్మకంగా సినిమాను రూపొందించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

‘వరలక్ష్మిని కాపాడే లాయర్‌ ఈ కర్నూలు సిటీలో ఎవరూ లేరు..’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. లాయర్‌ సందీప్‌ కేసులు లేక రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ కనిపించారు. ‘ఒక కేసు ఇస్తే.. రెండో కేసు ఫ్రీ.. పేటీఎంలో పే చేస్తే 50% క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ సర్‌?’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌ ఫన్నీగా అనిపించింది. చివర్లో మాత్రం యాక్షన్‌ సన్నివేశాల్ని చూపించారు. ‘నిను వీడని నీడను నేనే’ హిట్‌ తర్వాత సందీప్‌ నటించిన సినిమా ఇది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.