close
కొత్త సినిమాలు
తోడల్లుడి కోసం వస్తున్న వెంకటేశ్‌

హైదరాబాద్‌: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం శిల్ప కళావేదికలో నిర్వహించనున్నట్లు సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరుణ్‌తేజ్‌, వెంకటేష్‌ కలిసి ‘ఎఫ్‌2’ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఈ ఇద్దరు కథానాయకులు తోడల్లుడిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. 

వాల్మీకిలో వరుణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ‘వాల్మీకి’ తెరకెక్కతోంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.