close
కొత్త సినిమాలు
పట్టాలెక్కనున్న రాజశేఖర్‌ కొత్త సినిమా

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ కొత్త సినిమా పట్టాలెక్కబోతోంది. ఆయన కథానాయకుడిగా ప్రదీప్‌ కృష్ణమూర్తి (‘సత్య’ ఫేం) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ధనంజయన్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అక్టోబరు నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర బృందం పేర్కొంది.

‘గరుడవేగ’ తర్వాత రాజశేఖర్‌ వరుస సినిమాలకు సంతకం చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘కల్కి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడా కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్‌ 28న విడుదలైన సినిమా మంచి టాక్‌ అందుకుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.