close
కొత్త సినిమాలు
క్లాస్‌+మాస్‌ లుక్‌లో అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ ఆదివారం ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా అల్లు అర్జున్‌ తన అభిమానులతో పంచుకున్నారు. ‘ఫస్ట్‌ పోస్టర్‌ ఆఫ్‌ ఏవీపీఎల్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ప్రచార చిత్రంలో అల్లు అర్జున్‌ క్లాస్‌+మాస్‌ లుక్‌లో కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు. 

బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు ‘దువ్వాడ జగన్నాథం(డీజే)’లో కలిసి నటించారు. టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.