close
కొత్త సినిమాలు
కేజీఎఫ్‌-2 టీంకు షాక్‌

షూటింగ్‌ను నిలిపివేయాలన్న కోర్టు

చెన్నై: కన్నడ హీరో ‘యశ్‌’ నటించిన కేజీఎఫ్‌ చిత్రం భారత సినీ ప్రపంచంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్వీకెల్‌గా కేజీఎఫ్‌-2ను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా కోర్టు షాక్‌ ఇచ్చింది. యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతోందంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో అతని వాదనలు విన్న కోర్టు షూటింగ్‌ను నిలిపివేయాలని సూచించింది. 
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ ప్రధాన ప్రతినాయకుడైన అధీరా పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల సంజయ్‌దత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సంజయ్‌దత్‌ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.