close
కొత్త సినిమాలు
ఆది, శ్రద్ధాశ్రీనాథ్‌ ‘జోడి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు ఆది కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జోడి’. జెర్సీ సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్‌ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనున్నారు. విశ్వనాథ్‌ అరిగెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదలచేశారు. కుటుంబ విలువలతో కూడిన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ మీద ఆసక్తి ఉన్న తండ్రి పాత్రలో నరేష్‌ కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌లోని సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. పద్మజ, సాయి వెంకట గుర్రం నిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, విద్యుల్లేఖ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఆది నటించిన ‘బుర్రకథ’ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.