close
కొత్త సినిమాలు
ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలున్నాయి: నితిన్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నితిన్‌ ‘అ..ఆ’ సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన సినిమా ఇది. సమంత కథానాయిక. 2016 జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది. కాగా నితిన్‌ ప్రస్తుతం ‘భీష్మ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం ‘అ..ఆ’ సినిమా సెట్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నితిన్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘ఈ ఇంటితో అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ‘అ..ఆ’ ఓ అద్భుతమైన ప్రయాణం. ఇదే ఇంటిలో ‘భీష్మ’ కోసం చిత్రీకరణ జరుగుతోంది. త్రివిక్రమ్‌ గారు.. ఐ మిస్‌ యూ’ అని ఆయన పోస్ట్‌ చేశారు. వీడియోలో నితిన్‌ సరదాగా ఏడుస్తున్నట్లు నటిస్తూ కనిపించారు.

‘భీష్మ’ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. మరోపక్క నితిన్‌-వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ‘రంగ్‌దే’ సినిమా తెరకెక్కనుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. నితిన్‌, రాక్‌స్టార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా ఇది కావడం విశేషం.

 

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.