close
కొత్త సినిమాలు
ఆసక్తికరంగా ‘వార్‌’ తెలుగు ట్రైలర్‌

హైదరాబాద్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వార్‌’. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దిన ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. యాక్షన్‌కు పెట్టింది పేరు హృతిక్‌, టైగర్‌. ఇప్పుడు ఇద్దరూ తెరపై సందడి చేసేందుకు సిద్ధం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హృతిక్‌, టైగర్‌ మధ్య వచ్చే భారీ పోరాట సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయిక. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో  అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.