close
గుస‌గుస‌లు
యువ కథానాయకులతో భారీ యాక్షన్‌?

ల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’తో ఈ ఏడాది విజయాన్ని అందుకుంది కత్రినాకైఫ్‌. ఆమె అక్షయ్‌కుమార్‌తో ‘సూర్యవంశీ’లో  నటిస్తోంది. ఇప్పుడు కత్రినా ప్రధాన పాత్రలో ఓ భారీ యాక్షన్‌ చిత్రం చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కత్రినాతో పాటు యువ కథానాయకులు ఇషాన్‌ ఖత్తర్‌, సిద్ధార్థ్‌ చతుర్వేది కూడా నటించనున్నారట. ‘‘ఇదో భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రం. ఈ సినిమా కోసం కత్రినాతో సంప్రదింపులు జరిగాయి. త్వరలో అధికారిక ప్రకటన  వెలువడే అవకాశాలున్నాయి’’అని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వర్గాలు చెప్పాయి.

‘జీరో’ తర్వాత రాయ్‌తో: షారుఖ్‌ఖాన్‌తో ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించిన చిత్రం ‘జీరో’. ఇందులో కత్రినాకైఫ్‌, అనుష్కశర్మ నాయికలు. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఆనంద్‌ తెరకెక్కించే చిత్రంలో కత్రినాను ఎంపిక చేశారట. కొరియన్‌ చిత్రం ‘మిస్‌ అండ్‌ మిస్సెస్‌ కాప్స్‌’కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇందులో మరో నాయికకూ చోటుంది. ఆ పాత్రను విద్యాబాలన్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని రాయ్‌తో కలిసి షారుఖ్‌ నిర్మించనున్నారట. ఇందులో షారుఖ్‌ అతిథి పాత్రలో మెరిసే అవకాశం కూడా ఉందని ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ సన్నిహితులు చెబుతున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.